Share News

రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాబూరావునాయుడు

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:19 PM

రాష్ట్ర రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ తమర్భ బాబూరావునాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాబూరావునాయుడు
డాక్టర్‌ తమర్భ బాబూరావునాయుడు

ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

పాడేరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ తమర్భ బాబూరావునాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. పాడేరు మండలం డోకులూరు గ్రామానికి చెందిన ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ టి.బాబూరావునాయుడు రాష్ట్ర పునరావస విభాగం ప్రత్యేక కమిషనర్‌గా పనిచేస్తూ 2020 డిసెంబరులో పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) సంస్థలో ఓఎస్‌డీగా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన సేవలను వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈమేరకు ఆయన సేవలను గిరిజన ప్రాంతంలో కొనసాగించాలనే లక్ష్యంతో రాష్ట్ర రైతు సాధికారత సంస్థలో (మార్కెటింగ్‌, గిరిజనాభివృద్ధి) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించారు. సీఎం చంద్రబాబునాయుడు తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి గిరిజనాభివృద్ధికి కృషి చేస్తానని బాబూరావునాయుడు తెలిపారు.

Updated Date - Aug 29 , 2025 | 11:19 PM