ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:34 PM
ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏనుగురాయి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కొయ్యూరు ఎస్‌ఐ కిశోర్‌వర్మ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
కొయ్యూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏనుగురాయి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కొయ్యూరు ఎస్‌ఐ కిశోర్‌వర్మ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కృష్ణాదేవిపేటకు చెందిన రీమాల కల్యాణ చక్రవర్తి అలియాస్ చిన్న(28).. మారే అప్పారావు, కొండబాబుతో కలిసి ఎర్రబందలు వెళ్లే ఘాట్ రోడ్డులో పొయ్యిలో పుల్లల కోసం ఆటోలో మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. పుల్లలు సేకరించి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. ఘాట్ రోడ్డులో ఏనుగురాయి సమీపానికి వచ్చే సరికి ఆటో బోల్తా పడింది. చిన్న తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, అప్పారావు, కొండబాబులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. అయితే క్షతగాత్రుల్లో అప్పారావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాల సమాచారం.