Share News

అరకు- పాడేరు రోడ్డులో ఆటో బోల్తా

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:50 PM

మండలంలోని అరకు- పాడేరు ప్రధాన రహదారి కురిడి పెద్ద బ్రిడ్జి మలుపు వద్ద మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఓ ఆటో బోల్తా పడింది. ఇందులోని తొమ్మిది మంది బాలలకు గాయాలయ్యాయి.

 అరకు- పాడేరు రోడ్డులో ఆటో బోల్తా
అరకు- పాడేరు రహదారిలో బోల్తా పడిన ఆటో

తొమ్మిది మంది బాలలకు గాయాలు

పాఠశాలలో చేర్పించేందుకు వెళుతుండగా ప్రమాదం

డుంబ్రిగుడ, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని అరకు- పాడేరు ప్రధాన రహదారి కురిడి పెద్ద బ్రిడ్జి మలుపు వద్ద మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఓ ఆటో బోల్తా పడింది. ఇందులోని తొమ్మిది మంది బాలలకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. డుంబ్రిగుడ మండలం అరమ సంతవలస గ్రామానికి చెందిన గిరిజనులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ఆటోలో అరకులోయ బయలుదేరారు. మార్గమధ్యంలో కురిడి పెద్ద వంతెన మలుపు వద్ద ప్రమాదవశాత్తూ ఆటో బోల్తా పడింది. ఇందులోని ఎనిమిది బాలలకు స్వల్పంగా, ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంతో క్షతగాత్రులను వేరే ఆటోలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Jun 24 , 2025 | 11:50 PM