ఏయూ హాస్టల్ విద్యార్థుల ఆందోళన
ABN , Publish Date - Jul 23 , 2025 | 01:09 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఏయూ ప్రధానగేటు ముందు ఆందోళనకు దిగారు.
విశాఖపట్నం, జూలై 22 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఏయూ ప్రధానగేటు ముందు ఆందోళనకు దిగారు. వసతి గృహాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, ఫీజుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను వెనక్కి పంపించేందుకు యత్నించినా ససేమిరా అన్నారు. ఉన్నతాధికారులు వచ్చేంత వరకూ తాము కదిలేదని లేదని భీష్మించుకు కూర్చున్నారు. అయితే విద్యార్థులతో పోలీస్ అధికారులు చర్చలు జరపడంతో 11 గంటలకు ఆందోళన విరమించారు.