ఆటో డ్రైవర్లకు భరోసా
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:35 AM
రాష్ట్ర ప్రభుత్వం ఆటోలు, క్యాబ్ డ్రైవర్ల కోసం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని అమలు చేయనున్నది. అర్హులైన వారికి ఏటా రూ.15 వేల చొప్పున నగదు సాయం అందిచనున్నది. ‘స్ర్తీ శక్తి’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో తమకు ఆదాయం తగ్గిపోయిందని, ఆర్థికంగా ఆదుకోవాలన్న ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. తొలుత అక్టోబరు 2వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ సాంకేతిక కారణాలతో అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేశారు. అదే రోజు అర్హులైన్న డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపికను జిల్లా రవాణా శాఖ అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు.
జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి!
మొత్తం 15,237 మంది దరఖాస్తు
14,719 మంది అర్హులుగా గుర్తింపు
నాలుగో తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం ప్రారంభం
ఒక్కో డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.15 వేల చొప్పున జమ
అనకాపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆటోలు, క్యాబ్ డ్రైవర్ల కోసం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని అమలు చేయనున్నది. అర్హులైన వారికి ఏటా రూ.15 వేల చొప్పున నగదు సాయం అందిచనున్నది. ‘స్ర్తీ శక్తి’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో తమకు ఆదాయం తగ్గిపోయిందని, ఆర్థికంగా ఆదుకోవాలన్న ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. తొలుత అక్టోబరు 2వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ సాంకేతిక కారణాలతో అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేశారు. అదే రోజు అర్హులైన్న డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపికను జిల్లా రవాణా శాఖ అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. మొత్తం 15,237 మంది దరఖాస్తు చేసుకోగా, క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం 14,719 మందిని అర్హులుగా తేల్చారు. అత్యధికంగా అనకాపల్లిలో 1,060 మంది ఈ పథకానికి ఎంపికయ్యారు. అచ్యుతాపురం మండలంలో 804 మంది, బుచ్చెయ్యపేట మండలంలో 541 మంది అర్హత సాధించగా, ఎలమంచిలి మండలంలో అత్యల్పంగా 198 మంది మాత్రమే ఈ పథకానికి ఎంపికయ్యారు. అర్హుల పేర్లు లబ్దిదారుల జాబితాలో లేకపోతే... సచివాలయాల్లో మరోసారి దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కొత్తగా ఆటోలు కొనుగోలు చేసిన వారు సైతం ఈ పథకం కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.