Share News

‘ఆశా’లను పర్మనెంట్‌ చేయాలి

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:12 AM

ఆశా వర్కర్లను ప్రభుత్వం పర్మినెంట్‌ చేయాలని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. రెరడు రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్న యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్లపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పారు.

‘ఆశా’లను పర్మనెంట్‌ చేయాలి
సభలో మాట్లాడుతున్న ధనలక్ష్మి

యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్‌

ముగిసిన రాష్ట్ర మహాసభలు

అనకాపల్లి టౌన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్లను ప్రభుత్వం పర్మినెంట్‌ చేయాలని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. రెరడు రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్న యూనియన్‌ ఐదవ రాష్ట్ర మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్లపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశా వర్కర్లుగా గుర్తించాలని, ఆశా వర్కర్ల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన అంశాలపై వెంటనే జీవోలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆస్తులను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కార్మికుల పని గంటలను పెంచి శ్రమదోపిడీని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని ధ్వజమెత్తారు. మహాసభల్లో వెలుగు వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్‌. రూపాదేవి, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.సుబ్బారావు, ప్రజా ఆరోగ్యవేదిక రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.మాణిక్యం, డీడీ వరలక్ష్మి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు పోచమ్మ, పి.ధనశ్రీ, డి.సుధారాణి, సీఐటీయూ జిల్లా ప్రతినిధులు వీవీ శ్రీనివాసరావు, ఆర్‌.శంకరరావు, గంటా శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 12:12 AM