డిప్యూటీ సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:29 AM
అరకులోయ మండలంలో ఈ నెల 5న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
పాడేరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): అరకులోయ మండలంలో ఈ నెల 5న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం పర్యటనపై కలెక్టరేట్‌లో బుధవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం అరకులోయ మండలం కొత్తభల్లుగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం, ఆ తరువాత గిరిజనులతో ముఖాముఖీ కార్యక్రమం, అనంతరం మాడగడలో బలి ఉత్సవంలో పాల్గొంటారన్నారు. అయా కార్యాక్రమాలకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు అప్పగించిన ఏర్పాట్లను పక్కాగా చేయాలని, బందోబస్తు, వాహనాల పార్కింగ్, రోప్ పార్టీ, తదితర భద్రతా చర్యలను చేపట్టాలని ఎస్పీ అమిత్‌బర్ధార్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్ధార్, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.