Share News

టెన్త్‌ స్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు

ABN , Publish Date - May 17 , 2025 | 12:52 AM

ఈనెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. హాల్‌ టికెట్లను విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో రెగ్యులర్‌ 2,480 మంది విద్యార్థులు, ప్రైవేటు 712 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.

టెన్త్‌ స్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు

19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహణ

జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలు

అనకాపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): ఈనెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. హాల్‌ టికెట్లను విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో రెగ్యులర్‌ 2,480 మంది విద్యార్థులు, ప్రైవేటు 712 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.

ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 19 మంది డిపార్టుమెంట్‌ ఆపీసర్లు, 19 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లను నియమించారు. ప్రతి కేంద్రం పరిధిలో ఇన్విజిలేటర్లను నియమించి వారికి ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహించారు.

Updated Date - May 17 , 2025 | 12:52 AM