Share News

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:28 AM

జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం తన ఛాంబర్‌లో పౌర సరఫరాల సంస్థ అధికారులు, జిల్లాలోని రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైస్‌ మిల్లర్లు అందరూ వెంటనే ఈ-బ్యాంక్‌ గ్యారంటీలను పౌరసరఫరాలకు సమర్పించాలని చెప్పారు.

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయండి
మాట్లాడుతున్న జేసీ జాహ్నవి

రైస్‌ మిల్లర్లు వెంటనే ఈ-బ్యాంకు గ్యారంటీను సమర్పించాలి

జాయింట్‌ కలెక్టర్‌ జాహ్నవి ఆదేశం

అనకాపల్లి కలెక్టరేట్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి కోతలు ప్రారంభమైనందున ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం తన ఛాంబర్‌లో పౌర సరఫరాల సంస్థ అధికారులు, జిల్లాలోని రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైస్‌ మిల్లర్లు అందరూ వెంటనే ఈ-బ్యాంక్‌ గ్యారంటీలను పౌరసరఫరాలకు సమర్పించాలని చెప్పారు. ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులను ముందుగానే ఆయా కొనుగోలు కేంద్రాలకు పంపాలని స్పష్టం చేశారు. ధాన్యంలో తేమ శాతాన్ని, నాణ్యతను నిర్ధారించే క్రమంలో రైతులకు ఎటువంంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మూర్తి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ పి.జయంతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:28 AM