జనవరి ఆఖరున ‘అరకు చలి ఉత్సవ్’
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:59 AM
‘అరకు చలి ఉత్సవ్’ను వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహిస్తామని కలెక్టర్ దినేశ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కలెక్టర్ దినేశ్‌కుమార్ వెల్లడి
పాడేరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘అరకు చలి ఉత్సవ్’ను వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహిస్తామని కలెక్టర్ దినేశ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవ్‌ను డిసెంబరు నెలాఖరున లేదా జనవరి మొదటి వారంలో నిర్వహించాలని తొలుత భావించామని, అయితే విశాఖ ఉత్సవ్‌తో కలిసి అరకు ఉత్సవ్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో జనవరి చివరన అరకు చలి ఉత్సవ్ నిర్వహిస్తామని, తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.