పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీల నియామకం
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:54 PM
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు త్రిసభ్య కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జీవో(ఆర్‌టీ: 669) జారీ చేసింది.
జిల్లాలో ఎనిమిది పీఏసీఎస్‌లకు నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ
పాడేరు చైర్‌పర్సన్‌గా డప్పోడి వెంకటరమణ
పాడేరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు త్రిసభ్య కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జీవో(ఆర్‌టీ: 669) జారీ చేసింది. జిల్లాలో పాడేరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్) చైర్‌పర్సన్‌గా డప్పోడి వెంకటరమణ, సభ్యులుగా వంపూరు రమేశ్, మర్రి కొండబాబు, చింతపల్లి పీఏసీఎస్ చైర్‌పర్సన్‌గా గెమ్మెలి అబ్బాయిదొర, సభ్యులు సుర్ల అప్పలకొండ, పాంగి భీమన్న, జి.మాడుగులలో చైర్‌పర్సన్‌గా తాలే త్రిమూర్తులు, కిముడు వెంకటరమణ, కిముడు కల్యాణం, డుంబ్రిగుడ మండలం గుంటసీమలో చైర్‌పర్సన్‌గా పాంగి సుబ్బారావు, సభ్యులుగా తాంగుల కేశవరావు, గుంటా గంగాధర్, హుకుంపేటలో చైర్‌పర్సన్‌గా తాంగుల రామ్‌దాస్, సభులు కొర్రా సరస్వతి, వంతాల గాసన్న, పెదబయలులో చైర్‌పర్సన్‌గా నారంగి ప్రసాదరావు, సభ్యులుగా కోడా కోటేశ్వరరావు, కొర్రా లక్ష్మణరావు, ముంచంగిపుట్టులో చైర్‌పర్సన్ గా సమాల బాబూజీరావు, సభ్యులుగా రొబ్బా గణపతి, బి.బలరామ్, రంపచోడవరంలో చైర్‌పర్సన్‌గా ముర్ల నరసింగరాజారెడ్డి, సభ్యులుగా కడబాల గణపతిరెడ్డి, బొరగ సోమన్నదొరలను నియమించారు. ఈ ఉత్తర్వులు జారీ అయిన నాటి నుంచి వచ్చే ఏడాది జనవరి 30వ తేదీ వరకు మాత్రమే వారంతా ఆయా పదవుల్లో కొనసాగుతారని జీవోలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలోని కూటమి నేతలకు పీఏసీఎస్‌లలోని ఆయా పదవుల్లో అవకాశం కల్పించడంపై ఆయా పార్టీలకు చెందిన నేతలు, శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.