అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 22 , 2025 | 12:25 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జేసీ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్‌లో జాయింట్ కలెక్టర్ జాహ్నవి
ప్రజల నుంచి 320 వినతులు స్వీకరణ
అనకాపల్లి కలెక్టరేట్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జేసీ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో జేసీతోపాటు, డీఆర్‌ఓ సత్యనారాయణరావు, ఎస్‌డీసీ ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ, ఆర్జీల్లో పేర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సంబంధిత అర్జీదారులతో స్వయంగా మాట్లాడాలన్నారు. చట్టపరంగా అభ్యంతరాలు లేని అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కరించడానికి వీలుకాకపోతే కారణం ఏమిటో తెలియపరచాలని సూచించారు. అంతకుముందు శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న అర్జీలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. పీజీఆర్‌ఎస్ ముగిసే సరికి 320 అర్జీలు అందాయని కలెక్టరేట్ విభాగం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీవో జి.రామారావు, జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో...
అనకాపల్లి రూరల్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్‌సిన్హా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. వారి సమస్యను ఆలకించి, పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు బదలాయించారు. పీజీఆర్‌ఎస్‌కు 45 అర్జీలు అందగా వీటిలో ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు వంటి వాటికి సంబంధించినవి అధికంగా వున్నట్టు జిలా ్లపోలీస్ కార్యాలయ ఎస్‌ఐ జి.వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ(కైమ్) ఎల్.మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.