Share News

ఆర్టీసీ డ్రైవర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Aug 23 , 2025 | 11:29 PM

ఆర్టీసీ విశాఖ రీజియన్‌లో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకానికి యాజమాన్యం నిర్ణయించింది. రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోలకు సంబంధించి 80 మంది డ్రైవర్లు, 20 మంది మెకానిక్‌లను రిక్రూట్‌ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆర్టీసీ డ్రైవర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ద్వారకాబస్‌స్టేషన్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ విశాఖ రీజియన్‌లో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకానికి యాజమాన్యం నిర్ణయించింది. రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోలకు సంబంధించి 80 మంది డ్రైవర్లు, 20 మంది మెకానిక్‌లను రిక్రూట్‌ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డ్రైవర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌లో కనీసం 18 నెలల అనుభవం కలిగిన ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని ఆర్‌ఎం బి.అప్పలనాయుడు తెలిపారు. మెకానిక్‌ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు డీజిల్‌ మెకానిక్‌ విభాగంలో ఐటీఐ చదివి ఉండాలని, సంబంధిత ట్రేడ్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సమీపంలోని ఆర్టీసీ డిపోలను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8500265355 (విశాఖపట్నం డిపో), 9492447820 (మద్దిలపాలెం డిపో), 9398177747 (వాల్తేరు), 7382921997 (గాజువాక), 8142612140 (స్టీల్‌ సిటీ), 9989931179 (సింహాచలం), 9866324566 (మధురవాడ) నంబర్లకు సంప్రదించాలని కోరారు.

Updated Date - Aug 23 , 2025 | 11:29 PM