మెరైన్ ఫిట్టర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - May 22 , 2025 | 11:39 PM
వెసల్స్ నేవిగేటర్, మెరైన్ పిట్టర్ కోర్సులకు కేంద్రీయ మత్స్య నావిక, ఇంజనీరింగ్ శిక్షణ విభాగం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రెండేళ్ల కాలపరిమితితో ఈ శిక్షణ ఉంటుంది. కొచ్చి, చెన్నై, విశాఖ కేంద్రాలుగా శిక్షణ ఇస్తారు.
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): వెసల్స్ నేవిగేటర్, మెరైన్ పిట్టర్ కోర్సులకు కేంద్రీయ మత్స్య నావిక, ఇంజనీరింగ్ శిక్షణ విభాగం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. రెండేళ్ల కాలపరిమితితో ఈ శిక్షణ ఉంటుంది. కొచ్చి, చెన్నై, విశాఖ కేంద్రాలుగా శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండి, గణితం, సైన్స్ సబ్జెక్టులలో 40 శాతానికి పైగా మార్కులు వచ్చి ఉండాలి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షకు హాజరైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు వయసు ఆగస్టు 2025 నాటికి 15 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తులను సీఐఎఫ్‌ఎన్‌ఈటీ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను డైరెక్టర్, సిఫ్‌నెట్, ఫైన్ ఆర్ట్స్ ఎవెన్యూ, కొచ్చిన్- 682016 అనే చిరునామాకు జూన్ 16లోగా అందేలా పంపాలి.