Share News

ఏపీపీజీసెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:18 AM

రాష్ట్రవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీపీజీసెట్‌-2025 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకూ 31 సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 21,995 మంది విద్యార్థులు హాజరుకాగా, 19,488 మంది (88.6 శాతం) అర్హత సాధించారు.

ఏపీపీజీసెట్‌ ఫలితాలు విడుదల

ఉమ్మడి జిల్లా నుంచి 4,683 మంది హాజరు

4,188 మంది ఉత్తీర్ణత

విశాఖపట్నం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీపీజీసెట్‌-2025 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ నెల 9 నుంచి 12 తేదీ వరకూ 31 సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 21,995 మంది విద్యార్థులు హాజరుకాగా, 19,488 మంది (88.6 శాతం) అర్హత సాధించారు. వీరిలో ఏయూ పరిధిలో 15,740 మంది హాజరు కాగా, 14,005 (88.97 శాతం) మంది అర్హత సాధించారు. ఇక, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన విద్యార్థులు 4,683 మంది పరీక్షకు హాజరు కాగా, 4,188 మంది (89.43 శాతం) అర్హత సాధించారు.

Updated Date - Jun 26 , 2025 | 01:18 AM