అప్పన్నకు రూ.1.54 కోట్ల ఆదాయం
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:25 AM
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి గత 21 రోజుల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.54 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం ఈఓ ఎన్.సుజాత పర్యవేక్షణలో సిబ్బంది బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు.
సింహాచలం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి గత 21 రోజుల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.54 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం ఈఓ ఎన్.సుజాత పర్యవేక్షణలో సిబ్బంది బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు. నగదు రూపంలో రూ.1,54,68,696 కోట్లు సమకూరగా, 41 గ్రాముల స్వర్ణం, 5.3 కిలోల రజతం ఆభరణాల రూపంలో లభించాయి. అలాగే 591 యూఎస్‌ఏ డాలర్లు, 300 ఒమన్ పైసలు, 215 యూఏఈ ధీరమ్స్, 5 సౌదీ అరేబియా రియల్స్, 20 సింగపూర్ డాలర్లు, ఖతార్, మలేషియా, కెనడా, నేపాల్, ఇండోనేషియా తదితర దేశాలకు చెందిన కరెన్సీ కొంత లభించింది. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, దేవస్థానానికి చెందిన వివిధ విభాగాల ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు పాల్గొన్నారు.