గ్రేడ్-1 ఏజీపీగా అప్పలనాయుడు నియామకం
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:43 AM
విశాఖ జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు గ్రేడ్-1 అదనపు ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)గా ప్రముఖ న్యాయవాది కన్నూరు అప్పలనాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
కశింకోట, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు గ్రేడ్-1 అదనపు ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)గా ప్రముఖ న్యాయవాది కన్నూరు అప్పలనాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పలనాయుడు విశాఖపట్నం జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల పరిధిలో ప్రభుత్వం తరపున వివిధ సివిల్ కేసుల్లో వాదనలు వినిపించనున్నారు. ప్రభుత్వ ప్రయోజనాల పరిరక్షణకు అనుగుణంగా న్యాయపరమైన వ్యవహారాల్లో తగిన చర్యలు చేపట్టనున్నారు. కశింకోట మండలం పాత కన్నూరుపాలెం గ్రామానికి చెందిన కన్నూరు అప్పలనాయుడు.. 2006-09లో ఏయూ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం విశాఖపట్నం జిల్లా కోర్టులో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. ఏజీపీగా నియమితులైన అప్పలనాయుడుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కే.శ్రీనివాస్, కార్యదర్శి ఎల్.పి.నాయుడు, బార్ కౌన్సిల్ వైస్‌చైర్మన్ ఎస్.కృష్ణమోహన్, సభ్యులు పి.నర్సింగరావు, కె.రామజోగేశ్వరరావు, బైపా అరుణ్‌కుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.