కాఫీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏపీఎఫ్‌డీసీ అంగీకారం
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:31 PM
కాఫీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏపీఎఫ్‌డీసీ అంగీకారం తెలిపిందని పాడేరు డివిజనల్ మేనేజర్ జి. కృష్ణబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
దినసరి వేతనం, పండ్ల సేకరణ మొత్తం పెంపు
నివాస గృహాలకు మరమ్మతులు చేయిస్తాం
కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పిస్తాం
ప్రమాదవశాత్తూ కార్మికులు మరణిస్తే రూ.2లక్షలు
పాడేరు డివిజనల్ మేనేజర్ కృష్ణబాబు
చింతపల్లి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాఫీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏపీఎఫ్‌డీసీ అంగీకారం తెలిపిందని పాడేరు డివిజనల్ మేనేజర్ జి. కృష్ణబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం సీఐటీయూ నాయులు, కార్మికులు, ఏపీఎఫ్‌డీసీ యాజమాన్యం మధ్య చర్చలు జరిగాయన్నారు. ఈ మేరకు కాఫీ కార్మికులకు దినసరి వేతనం రూ.320.99 నుంచి రూ.350.82, పండ్ల సేకరణ కిలోకి రూ.6.10 నుంచి రూ.6.66 పెంచేందుకు అంగీకారం తెలిపామన్నారు. 26 రోజులు పని దినాలు కల్పిస్తామని, నివాస గృహాలు మరమ్మతులు చేస్తామన్నారు. కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్, పూర్తి స్థాయి కార్మికులకు పండగ సమయాల్లో పూర్తిస్థాయి మస్టర్ కల్పించడంతో పాటు ప్లాంటేషన్ హెల్పర్లకు గుర్తింపు కార్డులు, ఈపీఎఫ్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రమాదవశాత్తూ పనిలో కార్మికులు మరణిస్తే రూ.రెండు లక్షల ఆర్థిక సహాయం, తోటల్లో ప్రమాదాలు జరిగితే కార్మికులకు వైద్య ఖర్చులు చెల్లిస్తామన్నారు. ప్లాంటేషన్ కండక్టర్స్ నియామకం, పదోన్నతి, ప్రభుత్వ పరిధిలో ఉందన్నారు. ఈ విషయాన్ని వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకొని వెళతామన్నారు. టీఏ, డీఏ దినసరి వేతనంలో భాగమని, ప్రత్యేకంగా చెల్లించలేమన్నారు.