Share News

రూ.3.5 కోట్లతో యాంటీ డ్రగ్‌ గ్లో థీమ్‌ పార్కు

ABN , Publish Date - Oct 12 , 2025 | 12:59 AM

వీఎంఆర్డీఏ సిటీ సెంట్రల్‌ పార్కులో రూ.3.5 కోట్లతో యాంటీ డ్రగ్‌ గ్లో థీమ్‌ పార్కు ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు శనివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

రూ.3.5 కోట్లతో యాంటీ డ్రగ్‌ గ్లో థీమ్‌ పార్కు

సిటీ సెంట్రల్‌ పార్కులో ఏర్పాటు

వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు

విశాఖపట్నం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):

వీఎంఆర్డీఏ సిటీ సెంట్రల్‌ పార్కులో రూ.3.5 కోట్లతో యాంటీ డ్రగ్‌ గ్లో థీమ్‌ పార్కు ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు శనివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కార్యక్రమాన్ని వీఎంఆర్డీఏ కార్యాలయం నుంచి చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, కమిషనర్‌ విశ్వనాథన్‌ తదితరులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువత తప్పుడు మార్గంలో వెళ్లకుండా వినూత్నమైన యోచనతో ఈ థీమ్‌ పార్క్‌ నిర్మించడం మంచి ఆలోచన అని, ఇది విశాఖలో ప్రత్యేకంగా ఉంటుందన్నారు. అలాగే భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి వీఎంఆర్డీఏ చేపట్టిన మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు అందుబాటులోకి వచ్చేలా చూడాలని సూచించారు. వీఎంఆర్డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ మాట్లాడుతూ యాంటీ డ్రగ్‌ పార్కు అనేది ప్రపంచంలో ఇదే మొదటిదన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ కె.రమేశ్‌, సెక్రటరీ మురళీకృష్ణ, చీఫ్‌ ఇంజనీర్‌ వినయ్‌కుమార్‌, ఎస్‌ఈలు భవానీశంకర్‌, మధుసూదనరావు, సీయూపీ శిల్ప, డీఎఫ్‌వో సుజన శివానీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 12:59 AM