‘పేటలో ప్రారంభానికి అన్న క్యాంటీన్ సిద్ధం
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:23 AM
పాయకరావుపేటలో పేదలకు రూ.5లకే భోజనం అందించే అన్న క్యాంటీన్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2019లో అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టణంలోని అరటిగెలల మార్కెట్ స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనిత శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
- వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం
పాయకరావుపేట, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేటలో పేదలకు రూ.5లకే భోజనం అందించే అన్న క్యాంటీన్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2019లో అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టణంలోని అరటిగెలల మార్కెట్ స్థలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనిత శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. క్యాంటీన్ భవనం నిర్మాణంలో ఉంటుండగానే ఆ ఏడాది ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి రావడంతో ఇక్కడి క్యాంటీన్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కాగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జూన్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత చొరవతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల మొదటి వారంలో నిర్మాణ పనులు పూర్తి కాగా, వచ్చే నెలలో సంక్రాంతి నాడు ఈ క్యాంటీన్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.