Share News

అడవుల్లో జంతు గణన

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:51 AM

ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒక సారి జరిగే వణ్య ప్రాణుల గణన డిసెంబరు ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు నిర్వహించడానికి అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు మాంసాహార జంతువులు.. అంటే పులులు, చిరుత పులులు, ఖడ్గ మృగాలు, ఎలుగుబంట్లు వంటి వాటిని లెక్కిస్తారు. అటవీ శాఖ అధికారులు రోజూ ఉదయం ఆరు గంటలకు వణ్యప్రాణుల గణనను మొదలుపెడతారు. అటవీ ప్రాంతంలో రోజుకు ఐదు కిలోమీటర్ల చొప్పునతిరుగుతారు. ఈ సందర్భంగా ఆయా జంతువుల పాదముద్రలు, మలవిసర్జన వ్యర్థాలు, చెట్ల మీద ఉన్న గోర్లు గుర్తులు వంటి వాటి ద్వారా ఆయా జంతువులను గుర్తిస్తారు. మూడు రోజులపాటు సేకరించిన వివరాలను 4, 5 తేదీల్లో ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.

అడవుల్లో జంతు గణన
టైగర్‌, జింకలు, కణుజు

రేపటి నుంచి ప్రారంభం

1-3 తేదీల వరకు మాంసాహార జంతువులు..

6-8 తేదీల వరకు శాకాహార జంతువుల మదింపు

ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు

నర్సీపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒక సారి జరిగే వణ్య ప్రాణుల గణన డిసెంబరు ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు నిర్వహించడానికి అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు మాంసాహార జంతువులు.. అంటే పులులు, చిరుత పులులు, ఖడ్గ మృగాలు, ఎలుగుబంట్లు వంటి వాటిని లెక్కిస్తారు. అటవీ శాఖ అధికారులు రోజూ ఉదయం ఆరు గంటలకు వణ్యప్రాణుల గణనను మొదలుపెడతారు. అటవీ ప్రాంతంలో రోజుకు ఐదు కిలోమీటర్ల చొప్పునతిరుగుతారు. ఈ సందర్భంగా ఆయా జంతువుల పాదముద్రలు, మలవిసర్జన వ్యర్థాలు, చెట్ల మీద ఉన్న గోర్లు గుర్తులు వంటి వాటి ద్వారా ఆయా జంతువులను గుర్తిస్తారు. మూడు రోజులపాటు సేకరించిన వివరాలను 4, 5 తేదీల్లో ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. తర్వాత 6, 7, 8 తేదీల్లో అటవీ సిబ్బంది రోజుకు రెండు కిలోమీటర్ల చొప్పున అటవీ ప్రాంతంలో తిరుగుతూ కణుజు, అడవి పందులు, కొండ గొర్రె, దుప్పులు వంటి శాకాహార జంతువులను లెక్కిస్తారు. తొలుత 400 మీటర్లు, తరువాత 800 మీటర్లు, 1,200 మీటర్లు, 1,600 మీటర్లు, 2 వేల మీటర్లు మార్క్‌ చేసుకొని ప్రత్యక్షంగా లేదా ఆనవాళ్ల ద్వారా గుర్తించిన శాకాహార జంతువుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన సర్వే వివరాలతో సరిపోల్చుకుని, ఏయే జంతువులు తగ్గాయి లేదా పెరిగాయి అన్న వివరాలను కూడా పొందుపరుస్తారు.

సహకరించాలి

చోడవరం అటవీ శాఖ రేంజి అధికారి రవివర్మ

చోడవరం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు ఒకటి నుంచి 8వ తేదీ వరకు అటవీప్రాంతంలో నిర్వహించే జంతుగణనకు ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సహకరించాలని స్థానిక అటవీ శాఖ రేంజి అధికారి పీవీ రవివర్మ కోరారు. చిట్టచివరిగా 2022లో సర్వే నిర్వహించామని, గతంలో సర్వే వివరాలను ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేవారమని, ఈసారి వన్య ప్రాణుల గణన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని తెలిపారు. సర్వేకు సంబంధించి అటవీ శాఖ సిబ్బందికి జిల్లా, డివిజన్‌, రేంజి స్థాయిలో శిక్షణ ఇచ్చారని చెప్పారు. చోడవరం రేంజి పరిధిలో అడవి మేకలు, నెమళ్లు. కణుజులు, అడవికోళ్లు, దుప్పిలు, అడవి దున్నలు ఉన్నాయని అన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:51 AM