బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆడారి ఆనంద్‌కుమార్
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:56 AM
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆడారి ఆనంద్‌కుమార్
ఫోటో: 22ఏకేపీ.2ఏ:
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
అనకాపల్లి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ డెయిరీ చైర్మన్‌గా సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ఆడారి తులసీరావు రెండేళ్ల క్రితం మృతిచెందడంతో ఆయన కుమారుడైన ఆనంద్‌కుమార్ డెయిరీ పగ్గాలు చేపట్టారు. ఆది నుంచి టీడీపీలో వున్న ఆడారి కుటుంబం.. 2019 ఎన్నికల తరువాత రాజకీయ కారణాలతో వైసీపీలో చేరాల్సి వచ్చింది. అనంతరం ఆనంద్‌కుమార్ ఏపీఎంఎస్‌ఎండీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిచెందారు. గత ఏడాది డిసెంబరులో ఆయనతోపాటు విశాఖ డెయిరీకి చెందిన పలువురు డైరెక్టర్లు బీజేపీలో చేరారు. ఇప్పటి వరకు పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న ఆనంద్‌కుమార్‌ను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి వరించడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.