వదలని ముసురు
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:36 AM
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శనివారం మన్యంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ముసురు వాతావరణం నెలకొనగా, శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తీవ్రమైన ఎండకాసింది. ఆ తరువాత వాతావరణం మారిపోయి వర్షం కొనసాగింది.
- మన్యంలో కొనసాగుతున్న వర్షాలు
- జన జీవనానికి అంతరాయం
పాడేరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో శనివారం మన్యంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ముసురు వాతావరణం నెలకొనగా, శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తీవ్రమైన ఎండకాసింది. ఆ తరువాత వాతావరణం మారిపోయి వర్షం కొనసాగింది. ముఖ్యంగా ఒడిశాను ఆనుకుని ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో వర్షాలు కురవగా, ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షాలు పడ్డాయి. పాడేరులో మధ్యాహ్నం రెండు గంటల నుంచి వర్షం కురవడంతో జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మెట్ట ప్రాంతాల్లో ఖరీఫ్ వ్యవసాయ పనులు జరుగుతుండడంతో తాజా వర్షాలు అనుకూలిస్తాయని రైతులు అంటున్నారు.
అరకులోయలో...
అరకులోయ: మండలం పరిధిలో శనివారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. దఫదఫాలుగా వర్షం కురిసింది. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి నెలకొంది.
పెదబయలులో...
పెదబయలు: మండలంలో శనివారం వేకువజాము నుంచి చిరు జల్లులు కురిశాయి. కాసేపు ఎండకాసినా, మధ్యాహ్నం 3 గంటల తరువాత ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.