Share News

నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:44 AM

పాత మునిసిపల్‌ ఆఫీసు పైఅంతస్థులో ఒకే చోట డివిజన్‌ అభివృద్ధి అధికారి, డీఎల్‌పీవో, ఏపీడీ కార్యాలయాల కోసం రూ.5 లక్షల వ్యయంతో అన్ని హంగులతో భవనం సిద్ధం చేశారు. అయితే డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయం ఒక్కటే ఇక్కడికి తరలిరాగా, డీఎల్‌పీవో, ఎన్‌ఆర్‌జీఎస్‌ సహాయ ప్రాజెక్ట్‌ అధికారి కార్యాలయాలు మాత్రం తరలిరాలేదు. అవి ఇంకా పాత కార్యాలయాల భవనాల నుంచే పనులు చేస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం చేయడానికి, పరిపాలనా సౌలభ్యం కోసం మూడు డివిజనల్‌ కార్యాలయాలు ఒక చోట ఉండాలని ప్రభుత్వం భావించినా ప్రస్తుతం అది నెరవేరలేదు.

నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
మరమ్మతులు చేసి డీడీవో కార్యాలయం కోసం సిద్ధం చేసిన పాత మునిసిపల్‌ కార్యాలయ భవనం

ఒకే చోట డీడీవో, డీఎల్‌పీవో, ఏపీడీ కార్యాలయాలు ఉండాలని నిర్ణయం

పాత మునిసిపల్‌ ఆఫీసు పైఅంతస్థులో రూ.5 లక్షలతో భవనం సిద్ధం

అన్ని వసతులు కల్పన

నెల రోజులుగా డీడీవో ఇక్కడ నుంచే సేవలు

తరలిరాని డీఎల్‌పీవో, ఏపీడీలు

పాత కార్యాలయాల నుంచే విధులు

నర్సీపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పాత మునిసిపల్‌ ఆఫీసు పైఅంతస్థులో ఒకే చోట డివిజన్‌ అభివృద్ధి అధికారి, డీఎల్‌పీవో, ఏపీడీ కార్యాలయాల కోసం రూ.5 లక్షల వ్యయంతో అన్ని హంగులతో భవనం సిద్ధం చేశారు. అయితే డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయం ఒక్కటే ఇక్కడికి తరలిరాగా, డీఎల్‌పీవో, ఎన్‌ఆర్‌జీఎస్‌ సహాయ ప్రాజెక్ట్‌ అధికారి కార్యాలయాలు మాత్రం తరలిరాలేదు. అవి ఇంకా పాత కార్యాలయాల భవనాల నుంచే పనులు చేస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం చేయడానికి, పరిపాలనా సౌలభ్యం కోసం మూడు డివిజనల్‌ కార్యాలయాలు ఒక చోట ఉండాలని ప్రభుత్వం భావించినా ప్రస్తుతం అది నెరవేరలేదు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, డివిజన్‌ పంచాయతీ అధికారి, డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయాలు ఒక చోట ఏర్పాటు చేయడానికి 26వ వార్డులో ఉన్న పాత మునిసిపల్‌ కార్యాలయం పై అంతస్థులో డివిజనల్‌ అభివృద్ధి అధికారి కార్యాలయ భవనం సిద్ధం చేశారు. ఇందులోనే డీఎల్‌పీవో, ఉపాధిహమీ పథకం ఏపీడీకి ప్రత్యేకంగా క్యాబిన్లు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులు భావించారు. జిల్లా పరిషత్‌ సీఈవో మే నెలలో పాత మునిసిపల్‌ ఆఫీసు భవనాన్ని సందర్శించి ఇక్కడ మూడు ఆఫీసులు ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. భవనం మరమ్మతులకు రూ.5 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో భవనం మరమ్మతులు, రంగులు, మూడు ఆఫీసులకు ఏసీలు, ఫర్నిచర్‌, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. నెల రోజులుగా ఇక్కడి నుంచే డీడీవో నాగలక్ష్మి పని చేస్తున్నారు.

కొత్త కార్యాలయాలకు ఎప్పుడు వస్తారో..

డీఎల్‌పీవో కార్యాలయం బలిఘట్టంలో పాత పంచాయతీ ఆవరణలో ఉంది. మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలోని ఏపీవో కార్యాలయంలో ఒక గదిలో ఏపీడీ ఉంటున్నారు. డివిజినల్‌ అభివృద్ధి అధికారి(డీడీవో) కంట్రోల్‌లో డీఎల్‌పీవో, ఏపీడీలు పని చేయాల్సి ఉంది. మూడు డివిజనల్‌ కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉంటే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి. డీఎల్‌పీవో, ఏపీడీలు కూడా తయారు చేసిన డీడీ వో కార్యాలయం నుంచి విధులు నిర్వహించాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. దీనిపై డీఎల్‌పీవో మూర్తిని వివరణ కోరగా ఉన్నతాధికారులు తమకు ఇంకా ఏమీ చెప్పలేదని, అందుకనే ఆగామని తెలిపారు.

Updated Date - Sep 29 , 2025 | 12:44 AM