Share News

జాతీయ అవార్డులపై అభినందనల వెల్లువ

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:34 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి యోజన అమలులో దార్తి ఆబా జన్‌ భగీధారి అభియాన్‌ కింద జాతీయ స్థాయిలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఉత్తమ అవార్డు, పాడేరు ఐటీడీఏకు అవార్డుల దక్కడంపై రాష్ట్రగవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్‌ వేదికగా శనివారం అభినందనలు తెలిపారు.

 జాతీయ అవార్డులపై అభినందనల వెల్లువ
కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ను అభినందిస్తూ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్‌

ఇదే స్ఫూర్తిని కొనసాగించాలంటూ

గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు ట్వీట్‌

పాడేరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి యోజన అమలులో దార్తి ఆబా జన్‌ భగీధారి అభియాన్‌ కింద జాతీయ స్థాయిలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఉత్తమ అవార్డు, పాడేరు ఐటీడీఏకు అవార్డుల దక్కడంపై రాష్ట్రగవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్‌ వేదికగా శనివారం అభినందనలు తెలిపారు. జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర పథకాలైన పీఎం జనమన్‌, పీఎం జుగాలను అమలు చేస్తూ గిరిజనాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో గిరిజనాభివృద్ధికి కృషి చేయాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. జిల్లాకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు దక్కడంపై గవర్నర్‌, ముఖ్యమంత్రి నుంచి అభినందనలు పొందడంతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:34 PM