Share News

2029 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:13 AM

రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం పట్టణంలో ఆడారి నాగరత్నంకు ఇంటి తాళం నమూనాను అందజేసి గృహ ప్రవేశం చేశారు.

2029 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లు
అనకాపల్లిలో గృహ ప్రవేశం చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

- జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర

అనకాపల్లి టౌన్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం పట్టణంలో ఆడారి నాగరత్నంకు ఇంటి తాళం నమూనాను అందజేసి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు మూడు లక్షల ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. సొంత స్థలం ఉన్నవారికి ప్రభుత్వం రెండున్నర లక్షల ఆర్థిక సాయం అందించి ఇళ్ల నిర్మాణం చేపట్టిందన్నారు. 2014-19 మఽధ్య చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే రూ.లక్షన్నరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం చేసి పేదలకు తోడుగా నిలిచిందని తెలిపారు. గూగుల్‌ రాకతో విశాఖను ప్రపంచపటంపై నిలబెట్టామన్నారు. 2029 నాటికి రెండు కోట్ల మందికి సొంత ఇళ్లను అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన తెలిపారు. అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. టిడ్కో గృహాల్లో అనేక సమస్యలున్నాయని, ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కొత్తగా పట్టణానికి చెందిన 98 మందికి ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి, ఆర్డీవో షేక్‌ ఆయీషా, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్‌, కార్పొరేటర్‌ కొణతాల నీలిమా, బీఎస్‌ఎంకే జోగినాయుడు, జోనల్‌ కమిషనర్‌ కె.చక్రవర్తి, కూటమి నాయకులు, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 01:13 AM