రోజంతా ముసురు
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:36 PM
అరకులోయ, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం గంట సేపు భారీ వర్షం కురిసింది. ఆ తరువాత రోజంతా ముసురు నెలకొంది.

అరకులోయ, జూన్ 10(ఆంధ్రజ్యోతి): అరకులోయ, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం గంట సేపు భారీ వర్షం కురిసింది. ఆ తరువాత రోజంతా ముసురు నెలకొంది. వర్షం వల్ల రహదారులు చిత్తడిగా మారాయి. వాతావరణం చల్లబడడంతో జనం ఊరట చెందారు.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండలం పరిధిలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి చిరుజల్లులు మొదలయ్యాయి. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.