మలేరియా కేసులపై అప్రమత్తం
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:36 PM
మలేరియా కేసులు నమోదైన వెంటనే వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వైద్యసేవలను అందించాలని జోనల్ మలేరియా అధికారిణి డాక్టర్ బి.ప్రభావతి అన్నారు.
జోనల్ మలేరియా అధికారిణి డాక్టర్ ప్రభావతి
ఇద్దరు కేజీబీవీ విద్యార్థినులకు మలేరియా
అనంతగిరి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మలేరియా కేసులు నమోదైన వెంటనే వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వైద్యసేవలను అందించాలని జోనల్ మలేరియా అధికారిణి డాక్టర్ బి.ప్రభావతి అన్నారు. మండలంలోని కాశీపట్నం, కొత్తూరు కేజీబీవీ పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. కొత్తూరు కేజీబీవీకి చెందిన ఇద్దరు విద్యార్థినులకు మలేరియా పాటిజివ్ రావడంతో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిక్ రూమ్‌ను పరిశీలించి, దోమ తెరలను వాడాలని, కిటికీల నుంచి దోమలు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్ సుశీలకు సూచించారు. నీటినిల్వలు లేకుండా చూడాలన్నారు. దోమలను నివారించగలిగితే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా జ్వరాలను తగ్గించవచ్చునని చెప్పారు. మలేరియా కేసులు నమోదైన వెంటనే సిబ్బంది ప్రత్యేక వైద్యసేవలను అందించాలని వైద్యాధికారిణి జ్ఞానేశ్వరికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని జోనల్ కార్యాలయం ఎంపీహెచ్‌వో బి.తిరుపతిరావు, సబ్‌యూనిట్ అధికారి బాబూరావు, ఎంపీహెచ్‌ఈవో సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.