చిరుత పులి సంచారంపై అప్రమత్తం
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:26 PM
జీకేవీధి మండలం సప్పర్ల రెయిన్‌గేజ్ వద్ద బుధవారం సాయంత్రం చిరుత పులి సంచరించినట్టు పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై సీలేరు రేంజ్ అటవీశాఖాధికారి వెంకటరావు స్పందించారు.
సప్పర్ల రెయిన్‌గేజ్ వద్ద పరిశీలించిన అటవీ శాఖ సిబ్బంది
లభ్యమైన చిరుత పాద ముద్రలు
ఒడిశా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్టు నిర్ధారణ
సీలేరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం సప్పర్ల రెయిన్‌గేజ్ వద్ద బుధవారం సాయంత్రం చిరుత పులి సంచరించినట్టు పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై సీలేరు రేంజ్ అటవీశాఖాధికారి వెంకటరావు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం డిప్యూటీ రేంజ్ అధికారి సతీశ్ ఆధ్వర్యంలో సిబ్బంది రెయిన్‌గేజ్ ప్రాంతాన్ని పరిశీలించారు. రెయిన్‌గేజ్ రోడ్డు పక్కనే చిరుత పులి పాద ముద్రలను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. రెయిన్‌గేజ్ నుంచి అటవీ మార్గంలో ఒడిశా వైపు వెళ్లిపోయినట్టు తమ సిబ్బంది గుర్తించారని సీలేరు రేంజ్ అధికారి వెంకటరరావు తెలిపారు. సప్పర్ల, ధారకొండ ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచరిస్తున్నందున ఆ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అలాగే ద్విచక్ర వాహనాలపై ఈ ప్రాంతంలో ఒంటరిగా ప్రయాణం చేయవద్దని, రెయిన్‌గేజ్ ప్రాంతానికి పర్యాటకులు ఒకరు, ఇద్దరు వెళ్లరాదని ఆయన తెలిపారు.