Share News

రేషన్‌ కోసం సాహసం

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:33 PM

రేషన్‌ సరుకుల కోసం వెళ్లిన లబ్ధిదారులు ప్రాణాలకు తెగించి గెడ్డ దాటాల్సి వచ్చింది. మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ కేంద్రం నుంచి గద్దెరాయి రేషన్‌ షాపునకు బుధవారం పలువురు గిరిజనులు వెళ్లారు.

రేషన్‌ కోసం సాహసం
ఉధృతంగా ప్రవహిస్తున్న రాళ్లగెడ్డ దాటుతున్న రేషన్‌ లబ్ధిదారులు

ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటిన గిరిజనులు

జి.మాడుగుల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరుకుల కోసం వెళ్లిన లబ్ధిదారులు ప్రాణాలకు తెగించి గెడ్డ దాటాల్సి వచ్చింది. మండలంలోని కుంబిడిసింగి పంచాయతీ కేంద్రం నుంచి గద్దెరాయి రేషన్‌ షాపునకు బుధవారం పలువురు గిరిజనులు వెళ్లారు. రేషన్‌ సరుకులు తీసుకుని తిరిగి వస్తుండగా అప్పుడే కురిసిన భారీ వర్షానికి రాళ్లగెడ్డ పొంగి ప్రవహించింది. కొందరు ప్రాణాలకు తెగించి తాడు సహాయంతో అవతల ఒడ్డుకు చేరుకోగా, మహిళలు మాత్రం గెడ్డ ఉధృతి తగ్గే వరకు అక్కడే నిరీక్షించారు. వంతెన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Sep 10 , 2025 | 11:33 PM