అడిషనల్‌ఎస్‌పీ కె.ధీరజ్ బదిలీ
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:34 AM
స్థానిక అడిషనల్ ఎస్‌పీ కె.ధీరజ్‌ను అన్నమయ్య జిల్లా ఎస్‌పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.ధీరజ్ శిక్షణ పూర్తి చేసుకుని పాడేరు ఏఎస్‌పీగా 2023లో తొలి పోస్టింగ్‌లో చేరారు.
- అన్నమయ్య జిల్లాకు ఎస్‌పీగా నియామకం
పాడేరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక అడిషనల్ ఎస్‌పీ కె.ధీరజ్‌ను అన్నమయ్య జిల్లా ఎస్‌పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.ధీరజ్ శిక్షణ పూర్తి చేసుకుని పాడేరు ఏఎస్‌పీగా 2023లో తొలి పోస్టింగ్‌లో చేరారు. తరువాత రంపచోడవరం ఏఎస్‌పీగా పని చేస్తూ గతేడాది జనవరి 20న జిల్లా అడిషనల్ ఎస్‌పీగా నియమితులయ్యారు. సుమారుగా రెండున్నరేళ్లుగా జిల్లాలోనే ఏఎస్‌పీగా, అడిషనల్ ఎస్‌పీగా సేవలందించిన ఆయనను తాజాగా జరిగిన ఎస్‌పీల బదిలీలు, నియామకాల్లో అన్నమయ్య జిల్లా ఎస్‌పీగా ప్రభుత్వం నియమించింది. విశాఖపట్నానికి చెందిన కె.ధీరజ్ సౌమ్యుడైన అధికారిగా, చక్కని ప్రజా సంబంధాలతో జనానికి చేరువకావడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారనే గుర్తింపును సంపాదించుకున్నారు.