చురుగ్గా ధాన్యం సేకరణ
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:05 AM
చురుగ్గా ధాన్యం సేకరణ
ఇప్పటికే 3,988 టన్నులు కొనుగోలు
రైతుల బ్యాంకు ఖాతాలకు 24 గంటల్లో సొమ్ము జమ
జేసీ జాహ్నవి వెల్లడి
అనకాపల్లి కలెక్టరేట్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి తెలిపారు. మంగళవారంనాటికి 1,428 మంది రైతుల నుంచి రూ.9.46 కోట్ల విలువ చేసే 3,988.32 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాలకు 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 1,179 మంది రైతులకు రూ.6.92 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. ధాన్యం విక్రయించే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా 80089 01584 నంబర్‌కు ఫోన్ చేయాలని ఆమె సూచించారు.