తాగునీటి సరఫరాపై ఫిర్యాదులొస్తే చర్యలు
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:22 AM
గ్రామాల్లోని తాగునీటి సరఫరా సక్రమంగా జరగలేదని ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు చేపడతామని ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ హెచ్చరించారు. పంచాయతీరాజ్, గ్రామీణా నీటి సరఫరా విభాగం అధికారులతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా బాధ్యత కేవలం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులదే కాదని, సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు సైతం బాధ్యత వహించాలన్నారు.
అధికారులకు ఐటీడీఏ పీవో శ్రీపూజ హెచ్చరిక
సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లదే బాధ్యత
గ్రామాల్లో నీరు, పారిశుధ్య కమిటీలు
క్రియాశీలకంగా పనిచేయించాలి
పాడేరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని తాగునీటి సరఫరా సక్రమంగా జరగలేదని ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు చేపడతామని ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ హెచ్చరించారు. పంచాయతీరాజ్, గ్రామీణా నీటి సరఫరా విభాగం అధికారులతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా బాధ్యత కేవలం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులదే కాదని, సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు సైతం బాధ్యత వహించాలన్నారు. తాగునీటి పథకాలను సక్రమంగా నిర్వహించి ప్రజలకు నీటిని అందించాలన్నారు. గ్రామాల్లో నీరు, పారిశుధ్య కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. ఈక్రమంలో క్షేత్ర స్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు చేపట్టాల్సిన విధులు, తదితర అంశాలను గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్ వివరించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ బీవీ.నాగేశ్వరరావు, నవనిర్మాణ సమితి ప్రతినిధి కుమార్, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.
సూపర్-50 కోచింగ్‌కు 104 మంది విద్యార్థులు ఎంపిక
సూపర్-50 పేరిట పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహించే కోచింగ్‌కు 104 మందిని ఎంపిక చేశామని ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ అన్నారు. సూపర్- 50పై శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల ఒకటో తేదీన నిర్వహించిన స్కీనింగ్ టెస్ట్‌కు 538 మంది హాజరయ్యారని, వారిలో 104 మంది ఎంపికయ్యారన్నారు. పాడేరు మండలం దిగువ మోదాపుట్టు ఆశ్రమ పాఠశాలలో 25 మంది బాలురు, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాలలో 25 మంది బాలికలు, చింతపల్లిలో బాలుర ఆశ్రమ పాఠశాలలో 26 మంది, బాలికల ఆశ్రమ పాఠశాలలో 28 మందికి సూపర్-50 ప్రత్యేక కోచింగ్ అందిస్తామన్నారు. అలాగే ఏటీడబ్ల్యూలు, హెచ్‌ఎంలు మరింత ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీవో శ్రీపూజ సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, ఏటీడబ్ల్యూవోలు అఖిల, క్రాంతికుమార్, వెంకటరమణ, హెచ్‌ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.