అచ్యుతాపురం తహసీల్దార్ బదిలీ
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:07 AM
స్థానిక తహశీల్దార్ జి.సత్యనారాయణను బదిలీ చేస్తూ కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా కలెక్టర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఎలమంచిలి తహశీల్దార్ వరహాలు అచ్యుతాపురం మండలానికి ఇన్‌చార్జిగా నియమితులయ్యారు.
ఎక్కడా పోస్టింగు ఇవ్వని కలెక్టర్
కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశం
ఇటీవల సీఐ గణేశ్ బదిలీ
భోగాపురం భూ వివాదమే కారణమని ఊహాగానాలు
త్వరలో మరో అధికారిపై బదిలీ వేటు?
అచ్యుతాపురం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక తహశీల్దార్ జి.సత్యనారాయణను బదిలీ చేస్తూ కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా కలెక్టర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఎలమంచిలి తహశీల్దార్ వరహాలు అచ్యుతాపురం మండలానికి ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ఆయన గురువారం సాయంత్రం ఇక్కడ ఎఫ్‌ఏసీగా బాధ్యతలు తీసుకున్నారు. తహశీల్దార్ బదిలీకి భోగాపురం గ్రామంలోని భూ వివాదమే కారణని రెవెన్యూ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి సీఐ నమ్మి గణేశ్‌ను విశాఖపట్నం రేంజ్‌కి అటాచ్ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జట్టి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోని ఇద్దరు అధికారులకు స్థానచలం కలిగించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. భోగాపురంలో సుమారు 33 ఎకరాలకు సంబంధించి భూ వివాదం నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్నది. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు రూ.300 కోట్లు వుంటుందని చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య నడుస్తున్న ఈ భూ వివాదంలో సీఐ, తహశీల్దారు రాజకీయ ఒత్తిడితో ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నట్టు రాజధాని స్థాయిలో ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తొలుత సీఐపై చర్యల్లో భాగంగా డీఐజీ కార్యాలయాలనికి అలాచ్ చేసినట్టు చెబుతున్నారు. తాజాగా తహశీల్దారును అక్కడి నుంచి బదిలీ చేసి, ఎక్కడా పోస్టింగు ఇవ్వకుండా కలెక్టరేట్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ భూ వివాదానికి సంబంధించి మరో ముఖ్య అధికారిపైనా బదిలీ వేటు పడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.