Share News

పోక్సో కేసులో ముద్దాయికి పదేళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:54 AM

మండలంలోని రత్నాయమ్మపేటలో సుమారు ఐదేళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ముద్దాయికి పదేళ్లపాటు కారాగార శిక్ష విధిస్తూ విశాఖలోని పోక్సో కోర్టు ముద్దాయికి తీర్పు చెప్పింది. ఇందుకు సంబంధించి సీఐ జి.అప్పన్న తెలిపిన వివరాలిలా వున్నాయి.

పోక్సో కేసులో ముద్దాయికి పదేళ్ల జైలు శిక్ష

పాయకరావుపేట రూరల్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రత్నాయమ్మపేటలో సుమారు ఐదేళ్ల క్రితం జరిగిన అత్యాచారం కేసులో ముద్దాయికి పదేళ్లపాటు కారాగార శిక్ష విధిస్తూ విశాఖలోని పోక్సో కోర్టు ముద్దాయికి తీర్పు చెప్పింది. ఇందుకు సంబంధించి సీఐ జి.అప్పన్న తెలిపిన వివరాలిలా వున్నాయి.

మండలంలోని కుమారపురం శివారు రత్నాయమ్మపేట గ్రామానికి చెందిన బత్తిన దుర్గాప్రసాద్‌ 2020 ఫిబ్రవరి నెలలో అదే గ్రామానికి చెందిన ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్ది రోజుల తరువాత బాలికకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించి బాలిక గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు అనంతరం పోలీసులు విశాఖపట్నం పోక్సో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బట్టి రాజశేఖర్‌ కేసును వాదించారు. పోలీసులు మోపిన అభియోగం రుజువు కావడంతో ముద్దాయి దుర్గాప్రసాద్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలలపాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు.

Updated Date - Dec 13 , 2025 | 12:54 AM