Share News

పాడేరు డీఎస్పీగా అభిషేక్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:56 PM

పాడేరు డీఎస్పీగా ఆర్‌ఆర్‌వీఎస్‌.అభిషేక్‌ శనివారం బాధ్యతలను స్వీకరించారు.

పాడేరు డీఎస్పీగా  అభిషేక్‌ బాధ్యతల స్వీకరణ
పాడేరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అభిషేక్‌

పాడేరురూరల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పాడేరు డీఎస్పీగా ఆర్‌ఆర్‌వీఎస్‌.అభిషేక్‌ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ డీఎస్పీగా విధులు నిర్వహించే షేక్‌ షహబాజ్‌ అహమ్మద్‌కు శ్రీకాకుళం జిల్లా పలాస(కాశీబుగ్గ)కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డీఎస్పీగా శిక్షణ పూర్తి చేసుకున్న అభిషేక్‌ పాడేరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌ డివిజన్‌ పరిధిలో శాంతిభద్రతలను కాపాడుతాననన్నారు. మహిళలు, చిన్నారుల పట్ల నేరాలు జరగకుండా చూస్తానన్నారు. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 10:56 PM