లోకేశ్‌కు ఘన స్వాగతం
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:47 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం సోమవారం విశాఖకు చేరుకున్నారు.

రాత్రికి టీడీపీ కార్యాలయంలోనే బస
విశాఖపట్నం/గోపాలపట్నం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం సోమవారం విశాఖకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 8.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పలువురు టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం లోకేశ్ రోడ్డు మార్గంగో గుండా పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరి వెళ్లారు.
కాగా పార్వతీపురంలో షైనింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న అనంతరం ఆయన రాత్రి 10 గంటల ప్రాంతంలో నగరంలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. లోకేశ్‌కు ఇన్‌చార్జి మంత్రి బాలవీరాంజనేయస్వామి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి, మేయర్ పీలా శ్రీనివాస్, తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.