ఉక్కు మనిషికి ఘన నివాళి
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:05 AM
ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు జిల్లా యంత్రాంగం ఘనంగా నివాళులర్పించింది.
పాడేరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు జిల్లా యంత్రాంగం ఘనంగా నివాళులర్పించింది. శుక్రవారం వల్లభ్ భాయ్ పటేల్ 149 జయంతి సందర్భంగా స్థానిక ఐటీడీఏ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వల్లభ్ భాయ్ పటేల్ సేవలను జిల్లా కలెక్టర్, తదితరులు కొనియాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్‌వో పద్మలత, ఆర్‌డీవో లోకేశ్వరరావు, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఏవో కె.హేమలత, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.