Share News

జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:05 PM

జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే చిత్రపటానికి కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జ్యోతిరావు పూలేకు ఘన నివాళి
జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

పాడేరు, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే చిత్రపటానికి కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చేసిన సేవలు, మహిళల హక్కుల కోసం, కుల వివక్షను రూపు మాపడం కోసం ఆయన చేసిన కృషిని కలెక్టర్‌ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, తదితరులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ్‌ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐటీడీఏ ఏపీవోలు వీఎస్‌.ప్రభాకరావు, ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.హేమలతదేవీ, వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ లక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పాపారత్నం, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:05 PM