పల్లా సింహాచలానికి కన్నీటి వీడ్కోలు
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:19 AM
దివంగత మాజీ ఎమ్మెల్యే, కార్మిక నేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలానికి ఆదివారం అధికార లాంఛనాల నడుమ కన్నీటి వీడ్కోలు పలికారు.
కొత్త గాజువాక శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
పార్ధివదేహం వద్ద నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు
గాజువాక/మల్కాపురం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
దివంగత మాజీ ఎమ్మెల్యే, కార్మిక నేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలానికి ఆదివారం అధికార లాంఛనాల నడుమ కన్నీటి వీడ్కోలు పలికారు. ముందుగా పల్లా సింహాచలం పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం కొత్తగాజువాకలోని ఆయన స్వగృహంలో ఉంచారు. గాజువాకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం కొత్త గాజువాకలోని శ్మశానవాటికలో నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్ద కుమారుడు శంకరరావు తండ్రి చితికి నిప్పంటించారు. పోలీసులు తుపాకీలతో గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు.
తొలుత సింహాచలం పార్ధివదేహానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత ఆయన కుమారుడైన పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు. అలాగే విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేశ్‌బాబు, పి.విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధరప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కోన తాతారావు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావుతో పాటు పలువురు కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.