మన్యంలో ముసురు
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:52 PM
మన్యంలో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సీలేరు, ముంచంగిపుట్టులో జోరువాన కురిసింది. దీంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.
జిల్లాలో పలు చోట్ల వర్షం
పాడేరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం ముసురు వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సీలేరు, ముంచంగిపుట్టులో జోరువాన కురిసింది. దీంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.
సీలేరులో..
సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొనగా, మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో వినియోగదారులు లేక వారపు సంత వెలవెలబోయింది.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ వాతావరణం నెలకొనగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. నిత్యం రద్దీగా ఉండే స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో జనసంచారం తగ్గుముఖం పట్టింది. రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.