Share News

విశ్రాంత ఐఏఎస్‌ బాబూరావునాయుడును అరుదైన అవకాశం

ABN , Publish Date - Aug 04 , 2025 | 11:39 PM

స్థానికుడైన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ టి.బాబూరావునాయుడుకు అరుదైన అవకాశం దక్కింది. ఆదివాసీల కోసం రాష్ట్రపతి ముర్ము సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆదివాసీలకు సంబంధించిన సమస్యలను ఆమె వద్ద ప్రస్తావించే అవకాశం ఆయనకు దక్కింది.

విశ్రాంత ఐఏఎస్‌ బాబూరావునాయుడును అరుదైన అవకాశం
రాష్ట్రపతి ముర్మును మర్యాదపుర్వకంగా పలకరిస్తున్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బాబూరావునాయుడు(మధ్యలో వ్యక్తి), తదితరులు

రాష్ట్రపతి ముర్ముతో ఆదివాసీ సమస్యల ప్రస్తావన

పాడేరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): స్థానికుడైన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ టి.బాబూరావునాయుడుకు అరుదైన అవకాశం దక్కింది. ఆదివాసీల కోసం రాష్ట్రపతి ముర్ము సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆదివాసీలకు సంబంధించిన సమస్యలను ఆమె వద్ద ప్రస్తావించే అవకాశం ఆయనకు దక్కింది. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ నేతలు, ఆదివాసీ విశాంత్ర సివిల్‌ సర్వీస్‌ అధికారులు, తదితరులతో రాష్ట్రపతి భేటీ నిర్వహించారు. ఈక్రమంలో రాష్ట్రంలోని ఆదివాసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఆదివాసీ ప్రాంతాల్లో అమలవుతున్న తీరును ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్యూయల్‌ ఓరం, కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి ఉయికే ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పాడేరుకు చెందిన టి.బాబూరావునాయుడుకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కింది. గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తికి అరుదైన అవకాశం దక్కడంపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 04 , 2025 | 11:39 PM