Share News

త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:20 AM

జీకేవీధి మండలం ధారకొండ గుమ్మిరేవుల రహదారిలో మంళవారం నర్సీపట్నం ఆర్టీసీ డిపో బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కొండల్లో కురిసిన వర్షపు నీరు మాదిమళ్లు గెడ్డలో చేరి ఉధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో నర్సీపట్నం- గుమ్మిరేవుల బస్సు మాదిమళ్లు వంతెన అప్రోచ్‌ రోడ్డు ఎక్కుతుండగా వర్షానికి బురదలో జారుకుంటూ వెనక్కి వచ్చేసింది.

త్రుటిలో తప్పిన ప్రమాదం
ధారకొండ గుమ్మిరేవుల రహదారిలో మాదిమళ్లు వంతెన అప్రోచ్‌ వద్ద బురదలో కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు

- భారీ వర్షానికి బురదమయంగా మాదిమళ్లు వంతెన అప్రోచ్‌ రోడ్డు

- జారుకుంటూ వెనక్కి వచ్చేసిన ఆర్టీసీ బస్సు

- డ్రైవర్‌ చాకచక్యంగా ప్రవర్తించడంతో తప్పిన ముప్పు

సీలేరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారకొండ గుమ్మిరేవుల రహదారిలో మంళవారం నర్సీపట్నం ఆర్టీసీ డిపో బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. కొండల్లో కురిసిన వర్షపు నీరు మాదిమళ్లు గెడ్డలో చేరి ఉధృతంగా ప్రవహించింది. ఆ సమయంలో నర్సీపట్నం- గుమ్మిరేవుల బస్సు మాదిమళ్లు వంతెన అప్రోచ్‌ రోడ్డు ఎక్కుతుండగా వర్షానికి బురదలో జారుకుంటూ వెనక్కి వచ్చేసింది. డ్రైవర్‌ బస్సుకు బ్రేకులు వేసినా ఆగలేదు. వరద ఉధృతికి అప్రోచ్‌ రోడ్డు కింద భాగంలో గండి పడింది. బస్సు అక్కడికి వచ్చి ఆగింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:20 AM