పాడేరు ఘాట్ రోడ్డులో కర్రల లారీ బోల్తా
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:03 AM
పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే ఘాట్ రోడ్డులో కోమాలమ్మ పనుకు మలుపు వద్ద గురువారం ఉదయం కర్రల లోడు లారీ అడుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మూడు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్
తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు
పాడేరురూరల్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే ఘాట్ రోడ్డులో కోమాలమ్మ పనుకు మలుపు వద్ద గురువారం ఉదయం కర్రల లోడు లారీ అడుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎక్స్‌కవేటర్‌తో సంఘటన స్థలానికి చేరుకొని కర్రలను, లారీని పక్కకు తీయించారు. సుమారు మూడు గంటల అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి.