Share News

పెళ్లి బృందానికి తప్పిన ప్రాణాపాయం

ABN , Publish Date - May 17 , 2025 | 12:52 AM

జాతీయ రహదారిపై స్థానిక సారిపల్లివానిపాలెం వద్ద శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి బృందానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. కశింకోట మండలం నూతనగుంటపాలెంలో గురువారం రాత్రి కలిగట్ల వినయ్‌, యామినికి వివాహమైంది. కొంతమంది బంధువులతో కలిసి నవదంపతులు కారులో శుక్రవారం ఉదయం అన్నవరం వెళ్లారు.

పెళ్లి బృందానికి తప్పిన ప్రాణాపాయం
ప్రమాదానికి గురైన కారు

అన్నవరం నుంచి వస్తుండగా డివైడర్‌ను ఢీకొన్న కారు

అదుపుతప్పి.. రోడ్డుకు అవతలవైపునకు దూసుకుపోయి బోల్తా

బెలూన్‌లు ఓపెన్‌ కావడంతో తప్పిన ముప్పు

నవదంపతులతోసహా ఐదుగురికి గాయాలు

నక్కపల్లి, మే 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై స్థానిక సారిపల్లివానిపాలెం వద్ద శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి బృందానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. కశింకోట మండలం నూతనగుంటపాలెంలో గురువారం రాత్రి కలిగట్ల వినయ్‌, యామినికి వివాహమైంది. కొంతమంది బంధువులతో కలిసి నవదంపతులు కారులో శుక్రవారం ఉదయం అన్నవరం వెళ్లారు. అక్కడ వ్రతం, దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా, నక్కపల్లి మండలం సారిపల్లివానిపాలెం జంక్షన్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొన్నది. అంతటితో ఆగకుండా పక్క లేన్‌లోకి దూసుకుపోయి బోల్తాపడింది. అదృష్టవశాత్తూ కారులో బెలూన్‌లు ఓపెన్‌కావడంతో నవ దంపతులపాటు కారులో వున్న ఎల్‌.వైష్ణవి, ఎ.ఆషా, డి.రోషిణి గాయాలతో బయటపడ్డారు. కారు తీవ్రంగా దెబ్బతిన్నది. నక్కపల్లి ఆస్పత్రిలో ప్రాఽథమిక చికిత్స అనంతరం నూతనగుంటపాలెం వెళ్లిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.

Updated Date - May 17 , 2025 | 12:52 AM