ధారాలమ్మ ఘాట్‌లో కూలిన భారీ చెట్టు
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:48 PM
జీకేవీధి మండలం ధారాలమ్మ ఘాట్ రోడ్డులో కురుస్తున్న వర్షాలకు ఆదివారం ఉదయం భారీ చెట్టు రోడ్డుకడ్డంగా కూలిపోయింది.
రెండు గంటలపాటు నిలిచిన ట్రాఫిక్
వాహనదారులే గిరిజనుల
సాయంతో చెట్టు తొలగింపు
సీలేరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ధారాలమ్మ ఘాట్ రోడ్డులో కురుస్తున్న వర్షాలకు ఆదివారం ఉదయం భారీ చెట్టు రోడ్డుకడ్డంగా కూలిపోయింది. దీంతో సీలేరు, జీకేవీధి మధ్య వాహనాల రాకపోకలకు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ధారాలమ్మ ఆలయం దిగువన ఆదివారం ఉదయం భారీ చెట్టు కూలిపోవడంతో సీలేరు నుంచి నర్సీపట్నంకు.. నర్సీపట్నం నుంచి సీలేరుకు వచ్చే వాహనాలు ఆగిపోయాయి. ధారాలమ్మ ఆలయానికి వెళ్లే భక్తుల వాహనాలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులే ధారకొండ సమీపంలోని గిరిజనులను తీసుకువచ్చి చెట్టును నరికించి రాకపోకలకు అంతరాయం లేకుండా చెట్టును తొలగించారు.