సింహాన్ని పోలిన శునకం
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:40 PM
అరకులోయలో సింహాన్ని పోలి ఉన్న శునకం ఆదివారం సందడి చేసింది.
అరకులోయలో సందడి
కుక్కతో సెల్ఫీలు దిగిన పర్యాటకులు
అరకులోయ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో సింహాన్ని పోలి ఉన్న శునకం ఆదివారం సందడి చేసింది. అచ్చం సింహాన్ని పోలి ఉండడంతో పలువురు పర్యాటకులు సెల్ఫీలు దిగారు. విశాఖపట్నంనకు చెందిన ఇస్సాన్ మదీన్ వల్లీ ఆదివారం ప్రకృతి అందాలు తిలకించేందుకు అరకులోయకు వచ్చారు. ఆయనతో పాటు తాను పెంచుకున్న టిబెటిన్ మాస్టిఫ్ కుక్కను టాపులేని జీపుపై తీసుకువచ్చారు. సింహం పోలిన కుక్కతో అరకులోయ వచ్చిన పర్యాటకులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ కుక్క పేరు మస్తిన్ సుల్తాన్.