మన్యంపై మంచు దుప్పటి
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:12 PM
మన్యంలో ఉదయం వేళల్లో పొగమంచు కురవడం సహజం. కానీ స్థానిక ఘాట్ మార్గంలో అందుకు భిన్నంగా గురువారం మధ్యాహ్నం కూడా దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.
పాడేరు ఘాట్‌లో మధ్యాహ్నం కూడా దట్టంగా పొగమంచు
లైట్లు వేసుకుని రాకపోకలు సాగించిన వాహనాలు
పాడేరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మన్యంలో ఉదయం వేళల్లో పొగమంచు కురవడం సహజం. కానీ స్థానిక ఘాట్ మార్గంలో అందుకు భిన్నంగా గురువారం మధ్యాహ్నం కూడా దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనచోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. ఘాట్ మార్గంలో అప్పుడప్పుడు విభిన్నమైన వాతావరణం నెలకొంటుందని, వాతావరణంలో మార్పుల కారణంగా మిట్టమధ్యాహ్నం సైతం పొగమంచు దట్టంగా కురుస్తుందని స్థానికులు అంటున్నారు. తాజా వాతావరణం సందర్శకులను ఆహ్లాదపరిచింది.