Share News

60 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Jul 29 , 2025 | 01:03 AM

మండలంలోని వడ్డిప జంక్షన్‌ వద్ద 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశామని సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ రామకృష్ణారావు తెలిపారు. దీనికి సంబంధించి వారు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

60 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి, నిందితులతో సీఐ, ఎస్‌ఐలు

ముగ్గురి అరెస్టు

రోలుగుంట, జూలై 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని వడ్డిప జంక్షన్‌ వద్ద 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశామని సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ రామకృష్ణారావు తెలిపారు. దీనికి సంబంధించి వారు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. సోమవారం ఉదయం వడ్డిప జంక్షన్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆటోలో వస్తున్నారు. ఆటోను ఆపి తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రత్నంపేటకు చెందిన వూడి రమణబాబు, ఆర్లి శ్రీను, చింతపల్లి మండలం మడిమబంద గ్రామానికి చెందిన కొర్రా సూరిబాబులను అరెస్టు చేశారు. వీరి నుంచి ఆటో, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. వీరిలో వూడి రమణబాబుపై 2023లో ఒక గంజాయి కేసు, ఆర్లి శ్రీనుపై నాలుగు గంజాయి కేసులు ఉన్నాయని చెప్పారు.

Updated Date - Jul 29 , 2025 | 01:03 AM