528 మంది మినీ అంగన్‌వాడీలు అప్‌గ్రేడ్
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:18 PM
జిల్లాలో 528 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం ఆ ఉత్తర్వుల కాపీలను అంగన్‌వాడీ కార్యకర్తలకు కలెక్టర్ దినేశ్‌కుమార్ అందజేశారు.
మెయిన్ అంగన్‌వాడీలుగా ఉన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ
పాడేరురూరల్, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 528 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం ఆ ఉత్తర్వుల కాపీలను అంగన్‌వాడీ కార్యకర్తలకు కలెక్టర్ దినేశ్‌కుమార్ అందజేశారు. అంగన్‌వాడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇచ్చిన 5జీ మొబైల్ ఫోన్లను అంగన్‌వాడీ కార్యకర్తలకు కలెక్టర్ అందజేశారు. అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తల్లో ఆనందం నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సీహెచ్ ఝాన్సీబాయి పాల్గొన్నారు.